ఆదివారం నాడు పాకిస్తాన్‌లో మృత్యుఘోష వినిపించింది. రెండు వేర్వేరు ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడటంతో 29మంది దుర్మరణం పాలయ్యారు. హవేలి కథువా నుంచి రావల్పిండి వెళ్తుండగా పనా బ్రిడ్జి సమీపంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
చదవండి: కఠిన చట్టాలు రూపొందిస్తున్నాం..? నేరగాళ్లను వదలిపెట్టేదిలేదన్న ప్రధాని..!
పదుల సంఖ్యలో ప్రాణాలు ఆవిరి..?
పంజాబ్ ప్రావిన్స్ ఘటనకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది షియా ముస్లిం యాత్రికులు దుర్మరణం పాలవ్వగా, మరో 32 మంది గాయపడ్డారని సమాచారం. ఇరాక్ నుంచి ఇరాన్ వెళ్తుండగా వారంతా మృత్యుఒడిలోకి చేరిపోయారు. కాగా, బస్సు బ్రేక్‌లు ఫెయిల్ కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక పోలీసులు అంటున్నారు.