దేశవ్యాప్తంగా అభయ హత్యాచార ఘటనపై ఉవ్వెత్తున నిరసనజ్వాల ఎగసిపడుతుంటే…రెండ్రోజుల వ్యవధిలో థానె జిల్లాలోని బద్లాపూర్‌లో మరో ఘటన మహారాష్ట్రను కుదిపేసింది. బద్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై స్కూల్ సిబ్బందిలో ఒకరు.. వాష్‌రూమ్‌లో లైంగింక దాడికి పాల్పడటంపై ఆ గ్రామంలో ఆగ్రహజ్వాల పెల్లుబికింది. దీంతో సదరు బాధ్యుల్ని సస్పెండ్ చేసేశారు అధికారులు. కాగా, ఇదే ఘటనపై ఈ నెల 24న మహారాష్ట్ర బంద్‌కు మహా వికాస్ అగాడీ పిలుపునిచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా…బంద్‌కు దూరంగా ఉండాలని రాజకీయ పార్టీలకు ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
చదవండి: “కల్కి” రికార్డ్ కు ఎసరు పెట్టిన “స్త్రీ 2”
అసోంలో దారుణం..? బాలికపై గ్యాంగ్‌రేప్..!
ఈశాన్య రాష్ట్రం అసోంలో దారుణం జరిగింది. గురువారం రాత్రి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా 14 ఏళ్లబాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. తమ కామదాహాన్ని తీర్చుకుని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు…తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. అయితే ఈకేసులో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు…మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.