నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు…గత కొంతకాలంగా వైసీపీ లో యాక్టీవ్ గా లేని ఆలీ అలకపూనాడుని లేట్ గా తెలిసింది.. రాజమండ్రీ టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు ఆలీ, కానీ అధిష్ఠానం నుండి ఏటువంటి పిలుపు రాకపోవడం తో అలీ అలిగి ఎలక్షన్ లో కూడా ప్రచారానికి వెళ్ళలేదు. జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా పనిచేసిన ఆలి… ఎలక్షన్స్ కంటే ముందే పార్టీ కి దూరంగా ఉంటూ వస్తున్నారు.. మైనార్టీ కోటా లో సీట్ రాకపోవడం.. అధిష్ఠానం నుండి ఏటువంటి స్పందన రాకపోవడంతో .. అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది.
ఇక రాజకీయాలకు దూరం గా ఉంటాను అని … వేడియో పెట్టి, వైసీపీ అధిష్టానానికి లేఖ ద్వారా తెలిపినట్టు వీడియో లో తెలియజేశారు అలీ..ఇదిలా ఉంటే..ఎన్డీఏ కూటమి గెలిచినా తరువాత మిత్రుడు పవన్ కళ్యాణ్ కు , చంద్రబాబు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి ఆలీ భవిష్యత్ లో రాజకీయాల నుండి దూరంగా ఉంటారో లేక ….ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతారో వేచి చూడాలి.