ఇచ్చిన డబ్బులకు సంజన న్యాయం చేసింది..డబ్బులు తీసుకుని సత్తెనపల్లి ఓటర్లు ఓటేయలేదు అంటూ మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన అంబటి రాంబాబు వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయం నిర్మించిందన్న కారణంతో అధికారులు కూల్చేశారు. దాన్ని పరిశీలించేందుకు వచ్చిన అంబటి రాంబాబు మీడియతో మాట్లాడారు.
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన మీరు…ఈ ఓటమిని ఎలా చూస్తారని అడగ్గా…సత్తెనపల్లి జనం కంటే…సుకన్యనే బెటర్ అని, తీసుకున్న డబ్బులకు న్యాయం చేసిందన్నారు. ఓటర్లు డబ్బులు తీసుకుని కూడా ఓటేయలేదన్నారు. అంబటి వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. పక్కనున్న లేళ్ల అప్పిరెడ్డి..పట్టుకుని సైగ చేయగా తేరుకున్న అంబటి క్షణం కూడా ఆగకుండా వెంటనే జారుకున్నారు.