ఏపీలో అన్నా క్యాంట్లీను ఏ ప్రభుత్వం వచ్చినా ఇక మూతపడవు. ఆ విధంగా సీఎం చంద్రబాబు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. విభజిత ఏపీ ఏర్పడి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్లను తెరపైకి తీసుకొచ్చారు. కూలీనాలీ చేసుకుని బుక్కెడు బువ్వ కోసం కష్టాలు పడేవారికి పట్టెడన్నం పెట్టే ఆలోచనను నాడు కార్యరూపం దాల్చారు. రోజుకు మూడుపూటలా 95 రుపాయలు ఖర్చయ్యే ఆహారాన్ని కేవలం 15 రూపాయలకే అందిస్తోంది బాబు సర్కార్. ఇలాంటి మహత్కార్యం తాము లేకున్నా ఆగకూడదని, దీనిని కచ్చితంగా ట్రస్టు ద్వారా శాశ్వతంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు.
చదవండి: పవన్ లేకుండా రీస్టార్ట్ అయిన ‘హరి హర వీర మల్లు’
విరాళాలు ఇవ్వండి…పేదల్ని బతికిద్దాం…
అన్నా క్యాంటీన్లు ఇకపై ట్రస్టు ద్వారా పూర్తిస్థాయిలో నడిపిస్తామన్న చంద్రబాబు…వివాహాలు, ఇతరత్రా శుభకార్యాల పేరిట ఆడంబరాల కోసం అతిగా వెచ్చించకుండా మీకున్న దాంట్లో ఎంతోకొంత అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వండని పిలుపునివ్వగా…సంపన్నులు పేదవాళ్లని పైకి తీసుకురావాలని సూచించారు. అందుకే జన్మభూమి 2.O ప్రారంభిస్తున్నామని గుర్తుచేశారు. SBI, ఖాతా నెంబర్ 37818165097….IFSC కోడ్ SBIN 0020541కు అన్నా క్యాంటీన్లకు దాతలు విరాళాలు నేరుగా పంపించవచ్చని…కంప్లీట్‌గా విరాళాల డబ్బు విషయంలో జవాబుదారీతనం ఉండేలా చూస్తామని, ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంచుతామని సీఎం చంద్రబాబు గుడివాడలో తొలి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడారు.