గత ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు కోకొల్లలు. కరకట్టపై ఉన్న ప్రజాభవన్ కూల్చివేత దగ్గరనుంచి మొదలు..
పేదోడికి పట్టెడన్నం పెట్టే కార్యక్రమానికి సున్నం పెట్టి అన్నా క్యాంటీన్ల పథకాన్ని క్లోజ్ చేసేశారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేగింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలియకో ఏమో గడిచిన ఐదేళ్లూ నియంతృత్వ పాలనలా జగన్ పరిపాలన ఉందన్న మాట ఆయన మూటగట్టుకున్నారు.
చదవండి: పాలన ముఖ్యమా..? పగ ముఖ్యమా..? : జోగి రమేష్
చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభం
జగన్ రాజకీయ కక్షతో మూసివేయించిన అన్నా క్యాంటీన్లను మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాక పునఃప్రారంభించే ఏర్పాట్లు చేశారు సీఎం చంద్రబాబు. గురువారం ఉదయం 6గంటల ౩౦ నిమిషాలకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో తొలి అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారాయన.
తొలివిడతగా 100 అన్నా క్యాంటీన్లు..!
గురువారం చంద్రబాబు చేతులుమీదుగా ప్రారంభించే తొలి అన్నా క్యాంటీన్‌తోపాటు మరో 99 క్యాంటీన్లు ప్రారంభించేందుకు సంకీర్ణ సర్కార్ సన్నాహకాలు కూడా పూర్తిచేసింది. క్యాంటీన్లలో ఆహార పదర్థాల ఉత్పత్తిని హరేకృష్ణ ఫౌండేషన్‌కు కూడా అప్పజెప్పింది.