ఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
చదవండి: కేంద్ర బడ్జెట్లో ఏపీకి శుభవార్త, ప్రత్యేక నిధుల కేటాయింపు
విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు.