పోసాని కూడా బుక్ అయిపోయారుగా..!
పోసానిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ..!
వైసీపీ చెబుతోన్నట్టు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమంతా…చట్టం తన పని చేసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు లగాయితూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ప్రెస్‌మీట్లలో తిట్లకు సంబంధించి వైసీపీ నేతలను, జగన్ అభిమానులపై ప్రస్తుతం కొరఢా ఝుళిపిస్తోంది కూటమి సర్కార్. ఇక ఈ కోవలోకే చేరిపోయారు వైసీపీ నేత పోసాని. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ కంప్లైంట్‌తో సీఐడీ కేసు ఫైల్ చేసింది.
2023, సెప్టెంబర్‌లో పోసాని మీడియా వేదికగా మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్షనేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారని వంశీకృష్ణ ఏపీ సీఐడీని ఆశ్రయించారు..
సీఎం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో… 111, 196, 353, 299, 336 (3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.