హైదరాబాద్లో నడుస్తోన్న క్యాబ్ డ్రైవర్లు మానవత్వం చూపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ క్యాబ్ డ్రైవర్లు పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్‌లో తాము క్యాబ్లను తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి చెందిన 2 వేల మంది హైదరాబాద్‌లో క్యాబ్‌లు నడుపుకుంటున్నారని.. వారంతా రోడ్డున పడే అవకాశం ఉందని పవన్ అన్నారు.
ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాగానే వారంతా ఇక్కడే క్యాబ్‌లు నడిపించుకుంటారన్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబ్‌లు నేషనల్ పర్మిట్లు కలిగి ఉన్నాయని.. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని రేవంత్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని క్యాబ్ డ్రైవర్లకు పవన్ భరోసా ఇచ్చారు.