వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

Spread the love

గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్‌ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్‌ గ్రూపులను, టెలిగ్రామ్‌ గ్రూప్స్‌‌ను క్రియేట్ చేశారని.. వీటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణల వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. వెంటనే అటువంటి క్షస్టర్‌ గ్రూపులను ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల లోపు డిలీట్‌ చేయాలని ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా అటువంటి గ్రూప్స్‌ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్‌ అవ్వాలని.. అందుకు అనుగుణంగా వారికి సచివాలయం సిబ్బంది సిటిజన్స్‌‌కు అవగాహన కల్పించాలని, స్వతహాగా ఆయా గ్రూప్స్‌ నుండి ఎగ్జిట్ అయ్యేలా చూడాలని GSWS ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ గ్రూపుల్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు రాష్ట్ర సచివాలయాలశాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశించారు. ప్రజలు కూడా స్వతహాగా ఈ గ్రూపుల నుంచి బయటకు రావాలని సూచించారు.

చదవండి: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా?

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపైనా సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటామంటున్నారు. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పీజీలు, డిగ్రీలు, డిప్లొమా చేసిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్, పదో తరగతి చదివిన వారు కూడా ఉన్నారు.

వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోందట. వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా సరికొత్త ఆలోచన చేస్తోందట ఏపీ ప్రభుత్వం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే.. వారి సేవల్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా ఆలోచన చేస్తోందట. వాలంటీర్ల వ్యవస్థ విషయంలో రాజీనే లేదని.. వారిని కొనసాగిస్తామంటోంది ప్రభుత్వం.. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...