గోదావరి పుష్కరాలంటేనే రాజమహేంద్రవరం…రాజమహేంద్రవరం అంటేనే పుష్కరస్నానం అన్నరీతిలో పేరొందింది. ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలంటే దేశంతోపాటు ఇతర దేశస్థులు వచ్చి పుణ్యస్నానమాచరించి వెళ్తుంటారు. అలాంటి రాజమహేంద్రవరం 2027లో రాబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా అక్కడి అధికార పార్టీ నేతలు, అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రచించి ముందుకెళ్లేలా ఇప్పటినుంచే కార్యాచరణకు సిద్ధమయ్యారు.
చదవండి: సామాన్యుడిలా జగన్..?
అందుకేనా..ఈ ముందస్తు ప్రణాళిక..?
విభజిత ఏపీ ఏర్పడ్డాక జరిగిన గోదావరి తొలి పుష్కరాల్లో చోటుచేసుకున్న విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. జులై 14, 2015లో జరిగిన రాజమహేంద్రవరం పుష్కరాలంటే ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆనాడు జరిగిన తొక్కిసలాటలో సుమారు 27మంది శివైక్యం చెందారు. అయితే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే ఇదంతా జరిగిందని నాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే…ఊహించని దానికంటే ఎక్కువ భక్తులు తరలిరావడమే ఈ విషాదానికి కారణంగా నాడు అధికారపార్టీ టీడీపీ చెప్పుకొచ్చింది. అయితే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదన్న గట్టి సంకల్పంతో వచ్చే పుష్కరాలకు ఇప్పటినుంచే పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నార్నది ప్రభుత్వ వర్గాల మాట.
కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష
గోదావరి పుష్కరాలపై స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్పీ నరసింహ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌లతో కలెక్టర్ ప్రశాంతి సమావేశమయ్యారు.
పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
పుష్కరాలపై ఇదీ అధికారుల ప్రణాళిక..?
- రాజమహేంద్రవరంలో రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి…
- మెయిన్‌రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదనలు…
- కంబాల చెరువు ప్రాంతంలో ముంపు సమస్యకు పరిష్కారం…
- ప్రధాన రహదారులు వెడల్పు చేయడం…
- తద్వార ట్రాఫిక్ సమస్యను అధిగమించడం…