విశాఖ శారదాపీఠానికి షాక్ ఇచ్చిన బాబు..!
జగన్ ఇచ్చిన 15ఎకరాలను రద్దుచేస్తూ జీవో..!
విశాఖ శారదాపీఠానికి ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన స్థలాన్ని రద్దుచేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ చేసింది. విశాఖలో 15 ఎకారల స్థలం విలువ సుమారుగా రూ.220 కోట్లయితే…కేవలం రూ.15లక్షల నామమాత్రపు ధరకు శారదాపీఠానికి ప్రభుత్వ భూములు కట్టబెట్టింది నాటి జగన్ సర్కార్. అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి జగన్ అవినీతి అక్రమాలన్నీ తోడుతోంది. ఈ క్రమంలో విశాఖ శారదపీఠానికి ఇచ్చిన 15 ఎకారాల భూమిపైనా విచారణ ప్రారంభించింది. అయితే దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం శారదాపీఠానికి ఇచ్చిన భూమి అనుమతులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా విశాఖలో ఉన్న ఒక్క శారదాపీఠం భూములపైనే కాదు, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా సదరు శారదపీఠం చేపట్టిన నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.
జగన్ డ్యూయల్ రోల్ స్వామికి కోపం తెప్పించిందా..?
ఇదిలాఉంటే, 2019కి ముందు శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుని, ఆయనిచ్చిన సూచనలతో జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేసేవారని వార్తలు హల్చల్ చేశాయి. 2019లో అధికారంలోకి వచ్చాక పలుమార్లు విశాఖ శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భాలనూ చూశాం. అయితే అధికారంలోకి వచ్చాక తన సూచనలను జగన్ పట్టించుకోవడం లేదని స్వరూపానందేంద్ర సరస్వతి ఫైర్ కూడా అయ్యారట. నియంతృత్వ నిర్ణయాలతో ముందుకెళ్తూ స్వామీజీకి కోపం తెప్పించారట. ఇందుకు ఉదాహరణ లేకపోనూ లేదు. ఏకీకృతంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖలో కలిపేలా జగన్ నిర్ణయం తీసుకోవడంతో…ఈ విషయంపై తాము పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక లేఖ రాయడం అందరికీ తెలిసిందే.