YCP హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని GOVT నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు.
అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలివ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి, CM చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు.