బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఢిల్లీలో జరిగిన పార్టీ హైకమాండ్ సమావేశానికి హాజరైన ఆమె…బీజేపీ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు సహేతుకం కాదన్న షర్మిల…భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడంలేదని ఘాటుగా ఫైరయ్యారు. మరోవైపు సెబీని తన గుప్పిట్లో పెట్టుకుని అదానీని మోదీ కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అదానీని కాపాడే విషయంలో మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామన్న ఆమె…కులగణనపై కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేయబోతుందని వెల్లడించారు.
చదవండి: దర్శకుల సంఘానికి దర్శకుడు సుకుమార్ 5 లక్షల విరాళం
పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి!
కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని బీజేపీ నియంతృత్వ పాలన, అడుగడుగునా పార్టీ పటిష్టతపై దిశానిర్దేశనం చేశారు.