అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీఎం..!
కొత్త ఇల్లు చూసుకుని వెళ్లిపోయిన కేజ్రీవాల్..!
ఆమ్ ఆద్మ్ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసారు. దీంతో, ఢిల్లీ ఫిరోజ్ షా రోడ్డులోని ప్రభుత్వ నివాసంలోకి కేజ్రీవాల్ కుటుంబం మారిపోయింది. కేజ్రీవాల్, అతని కుటుంబసభ్యులు కొత్త ఇంట్లోకి వెళ్లేముందు ఫిరోజ్‌షా రోడ్డులోని ప్రభుత్వ నివాసంలో ప్రార్థనలు జరిపారు. ఆయన వెళ్లిన ఈ కొత్త ఇల్లు పంజాబ్ ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించబడింది. మరోవైపు ఇది ఆప్ ప్రధాన కార్యాలయానికి అత్యంత దగ్గర.
చదవండి: అధికారంలోకి వచ్చాక.. పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ కుటుంబం ఢిల్లీ అసెంబ్లీకి సమీపంలోని సివిల్ లైన్స్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉండేది. ఇప్పుడా ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్‌తోపాటు ఫిరోజ్ షా రోడ్డులోని ప్రభుత్వ నివాసంలోకి కేజ్రీవాల్ కుటుంబం మారిపోయినట్లు ఆప్ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ కొత్త నివాసం ఆయన నియోజకవర్గానికి సమీపంలోనే ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ ఆయన కుటుంబం ఈ ఇంట్లోనే ఉండబోతుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. తనను ప్రజలు సచ్చీలుడని నమ్మితే మరోసారి గెలిపిస్తారని, లేదంటే లేదని కరాఖండీగా చెప్పేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం, ఆయన వారసురాలిగా అతిషీ ముఖ్యమంత్రి పీఠం అధీష్టించిన విషయం తెలిసిందే.