అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ‘‘ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా.. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు.
విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు