అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జో బైడెన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ ఇస్తానని తెలిపారు. కాగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల (డెమోక్రాట్లు) నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్