వైసీపీ బీజేపీలోకి వస్తానంటే తీసుకునేదే లేదని స్పష్టంచేశారు ఆపార్టీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు.
బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న ఆయన…వైసీపీని తమ పార్టీలోకి తీసుకుని తమను కూడా నాశనం అయిపోమంటారా అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు.
ఇదీ జగన్ అవినీతి..!
సీబీఐ, సీఐడీ ఏం చేస్తున్నాయి..?
మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన…ముఖ్యమంత్రి హోదాలు దోచుకున్న డబ్బులన్నీ బెంగలూరు ప్యాలెస్‌లో దాచిపెట్టారని ఆరోపించారు. అందుకే తరచూ జగన్ బెంగలూరు వెళ్తున్నారని…సీబీఐ, సీఐడీ ఏం చేస్తోంది…బెంగలూరు ప్యాలెస్‌పై రైడ్ చేయాలి కదా అంటూ ప్రశ్నించారు. కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని…కళ్లు మూసుకుంటే ఇక వైసీపీ కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఐదుసీట్లు కూడా రావని జోస్యం చెప్పారు విష్ణుకుమార్ రాజు.