విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం ఖరారయింది. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో ఉండటంతో ఆయన్ను ఏకగ్రీవ విజేతగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ఆయన విశాఖ జాయింట్ కలెక్టర్ నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.
చదవండి: మెగా ఇంటికి ఆడపడుచు గిఫ్ట్
బరిలో ఎవరూ లేరు…ఎందుకు?
విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స గత సోమవారం నామినేషన్ దాఖలు చేయగా…మంగళవారంతో నామినేషన్ గడువు సమీపిస్తున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బరినుంచి ఎన్డీయే తప్పుకున్నట్టు అయ్యింది. అయితే అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీ ఉల్లా ఉండటంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అయితే కొంతమంది వైసీపీ దూతలు ఆయన్ను చల్లార్చి పోటీ నుంచి తప్పుకునేలా చేశారన్న టాక్ వినిపిస్తోంది. సో, ఇలా బరిలో ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్సీగా బొత్సే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలతో ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైఎస్‌ఆర్సీపీకి, ఆ పార్టీ శ్రేణులకు ఈ విజయం కాస్త ఊరటనిచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.