తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేంత వరకు సీఎం వదిలి పెట్టేది లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మహిళా శాసన సభ్యులను అవమానపరిచిన సీఎంకు మహిళలంతా తగిన బుద్ది చెబుతారన్నారు.
చదవండి: “యావరేజ్ స్టూడెంట్ నాని” రివ్యూ
అసెంబ్లీ లో నిరసన తెలుపుతున్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యాన్ లో నుంచి కేటీఆర్ మాట్లాడారు. సీఎం అహంకారపూరిత మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పే వరకు సీఎంను వదలమన్నారు. సీఎం డౌన్…డౌన్ అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు.