బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది, ట్రయల్ కోర్టు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు.
చదవండి: రాజకీయాల్లోకి వచ్చేందుకు పవన్ స్ఫూర్తినిచ్చారు – విక్రమ్
ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా.. కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తిహాడ్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు ఇవాళ కలిసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.