దువ్వాడపై కూటమి సర్కార్ దరువు..?
పవన్‌పై అనుచిత వ్యాఖ్యలకుగానూ కేసు ఫైల్..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఫ్యామిలీకి దూరంగా ఉండి, దివ్వెల మాధురితో సన్నిహితంగా ఉండటంతో ఇటీవల వార్తల్లో ఒక్కసారిగా గుప్పుమన్న దువ్వాడ వార్తలు డెయిలీ సీరియల్‌లా తరచూ వస్తున్నే ఉండటం మనం చూస్తునే ఉన్నాం. అలాంటిది, ఆయనపై తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం, ఆ విషయంలో కేసు నమోదు అవడం సర్వత్రా చర్చకు దారితీసిందిప్పుడు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ కణితి కిరణ్ కుమార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గతంలో పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకున్నారు. పీకే అంటే పిచ్చినా కొడుకా అంటూ, రింగ్‌లోకి వస్తే ఒక్క నాకౌట్ దెబ్బతో కిందపడేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇలా పలు సందర్భాల్లో ఎలా పడితే అలా మాట్లాడి జనసేన శ్రేణుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇలా పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖలే దువ్వాడను కష్టాల్లో పడేశాయి.
ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి జనసేన ఇంఛార్జ్ కిరణ్ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.