బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపర్చేల వీడియో చేసాడంటూ ఆయనపై వానరసేన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సత్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బిల్లుగీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా ఒక షాట్ వీడియో చేశాడు.
వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా ఆ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆ వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.