నాంపల్లి కోర్టుకు జగన్..?
విదేశాలకు వెళ్లాలని వినతి..!
తన అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న ఈ తరుణంలో నాంపల్లి సీబీఐ కోర్టు మెట్లుఎక్కారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 20 రోజులపాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. లండన్‌లో ఉన్న కూతురిని చూసేందుకు తన క్లైంట్ వెళ్లాలని, ఇందుకుగాను అనుమతి ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది వాదన వినిపించారు.
చదవండి: టాప్ 3 గా శ్రద్ధా కపూర్
జగన్‌కు అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ..?
ఈ నెల 27న తీర్పు..!
ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 15 రోజులపాటు జగన్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే…తిరిగి మరోసారి ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కోర్టు వేదికగా సీబీఐ సిద్ధమయింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అతనికి అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం…తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన పిటిషన్‌పైనా ఈ నెల 30న సీబీఐ కోర్టు వెల్లడించనుంది.