సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సూచన చేసింది కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం. దీనిపై కేంద్ర ఇంటిలెజెన్సులోని కొందరితో మాట్లాడినప్పుడు పూర్తి వివరాలు వెల్లడించలేము.. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నిఘా విభాగం రెగ్యులర్ గా జరిగే ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపులలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావనలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చాయి అని చెప్పారు. ఆ గ్రూపులు ఎవరివి అన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేమని సమాధానం వచ్చింది.
అయితే లోతుగా విశ్లేషణ జరిపితే . శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి సన్నిహితునిగా మారడంతోపాటు ఎన్.డి.ఏ. కూటమి ఆంధ్రప్రదేశ్ లోను, కేంద్రంలోను అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు. దాని కారణంగా శ్రీ నరేంద్ర మోడీ గారి వ్యతిరేక శక్తుల దృష్టిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అన్న సందేహం ఉంది.
చదవండి: అల్లు – మెగా ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి – బన్నీవాస్
అదే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలనూ సమదృష్టితో చూస్తారు. తను ఆచరించేది హిందూ ధర్మం, అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచారవ్యవహారాలను తు.చ. తప్పక పాటిస్తారు. లౌకిక వాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మ రక్షణపై అభిప్రాయాల వెల్లడిని దాచుకోరు. ఇది కూడా శ్రీ మోడీ వారి వ్యతిరేక శక్తులకు కంటగింపుగా మారిందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రో కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.సి. పి.ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించివేశారు. ఇది ఆ వర్గాలకు మింగుడు పడని చేదు నిజం. ఈ కారణంగా ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయా..? ఎన్నికలకు ముందు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు ఒకరు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేశారు. బి.జె.పి.తో కలసి ప్రయాణం చేయడాన్ని వ్యతిరేకించారు. నిఘా వర్గాల దృష్టికి మావోల సంభాషణలు ఏమైనా చేరాయా..? ఏదేమైనా నిఘా వర్గాలు జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. జన సైనికులు సైతం శ్రీ పవన్ కళ్యాణ్ రక్షణ అంశంపై నిఘా వర్గాలు చేసిన సూచనలపై దృష్టిపెట్టాలి. తమ నాయకుని రక్షణ విషయంలో వారు చాల జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది.