కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్. తిరుమలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసారు. గత ప్రభుత్యం మీద ఘాటు కామెంట్స్ చేసారు. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు. అలాగే నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారు.
ఎర్రచందనం దోపిడీతో సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు.శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. అంతే కాకుండా నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు.నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు.ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయింది.అన్యమత పాలనపోయి గోవిందుడి పాలన వచ్చింది అంటూ మాట్లాడారు బండి సంజయ్.