అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..!
పరామర్శలు, పరిశీలనతో నేడంతా బిజీ..!
అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలుడు ప్రాంతాన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు. అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. కాగా, రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 18 మంది చనిపోయారని, శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తైతే కానీ మృతులు, క్షతగాత్రులు లెక్క తేల్చలేని స్థితిలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది.
చదవండి: విశ్వంభర టీజర్ ఏమైంది..?
ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి..?
మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్..!
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితులకు ఉచితంగా వైద్యంతోపాటు, వారు కోలుకునేంత వరకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తమ పార్టీ నాయకుల బృందం అక్కడ పర్యటించి బాధితులకు తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి.