రండి..రండి..రండి..!
సీబీఐకి బాబు ఆహ్వానం..?
ఏపీలో సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ…రాష్ట్రంలో ఉండే కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీచేశారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946, సెక్షన్ 03 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతూ ఆదేశాలు జారీచేసింది ఏపీ సర్కార్. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లుగా వెల్లడించింది.
చదవండి: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
నాడు పొమ్మన్నారు…నేడు రమ్మన్నారు..!
రాష్ట్రంలోకి సీబీఐ రాకపై బాబు యూటర్న్..?
విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా 2014లో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు…నాడు కేంద్రంతో పొసగని కారణంగా, ఆ వైరాన్ని సీబీఐ జోక్యంపై చూపెట్టారనేది రాజకీయవిశ్లేషకుల మాట. సీబీఐ విచారణ పేరుతో రాష్ట్రంలో కేంద్రం యొక్క జోక్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో, చంద్రబాబు నాడు జనరల్స్ కన్సెంట్ ఉత్తర్వుని ఎత్తివేశారని ఇప్పటికీ చాలామంది అంటుంటారు. అయితే జనరల్ కన్సెంట్ ఉత్తర్వుని తిరిగి కొనసాగిస్తూ , మళ్లీ రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని మేథావివర్గం అభిప్రాయపడుతోంది.