గత ఐదేళ్ల జగన్ మెహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయాయా?…టీడీపీ నేతలు నాడు చేసిన, నేడు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనేది పక్కన పెడితే.. మొత్తానికి చంద్రబాబు సీఎం అవ్వడంతో మళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని తెలుగుతమ్ముళ్ల పొగడ్తలే కాదు…చంద్రబాబు సత్తా తెలిసే, జగన్ పాలనలో వెళ్లిపోయిన కంపెనీలన్నీ తిరిగి అందుకే వస్తున్నాయన్న వారి ప్రచారానికి ఈ క్రింది కథనమే తార్కాణం.
చదవండి: మాధురి రాక్…దువ్వాడ షాక్…
త్వరలోనే అశోక్ లేల్యాండ్ పునఃప్రారంభం..!
విజయవాడ రూరల్ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ పునఃప్రారంభం కాబోతుంది. సదరు కంపెనీ యూనిట్‌ను సెప్టెంబరు 17న మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. 75 ఎకరాల్లో 130 కోట్లతో అశోక్ లేల్యాండ్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకాబోతుంది. దేశంలో తొలిసారిగా మల్లవల్లి పారిశ్రామికవాడలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను అశోక్ లేల్యాండ్ ఏర్పాటుచేసింది.
నాడు ఆగిపోయాయి…నేడు మొదలయ్యాయి
వాస్తవానికి అశోక్ లేల్యాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఎప్పుడో ఏర్పాటుకావాల్సి ఉంది. 2014 నుంచి 19వరకు సుమారు 75శాతం పనులు పూర్తికాగా, జగన్ నిర్లక్ష్య ధోరణితో సదరు యూనిట్ పనులు నిలిపివేసిన సందర్భాన్ని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డతో కలిసి కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు…ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్న ఇస్తామని హామీ ఇవ్వడంతో పనులు ఊపందుకుని ప్రారంభోత్సవ తేదీని సైతం అశోక్ లేల్యాండ్ ఖరారు చేసుకుంది.