ఒకే వేదికపైకి ఏపీ రాజకీయ నాయకులు రానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రాబోతున్నారు. జగన్, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావడానికి కారణం అంబానీ కుటుంబం. నేడే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం జరుగనుంది.
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహ మహోత్సవం ఇవాళ అట్టహాసంగా జరగనుంది. ముంబయి లోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశ దేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు అతిథులుగా వస్తున్నారు. ఇప్పటికే వీరంతా ముంబయికి చేరుకున్నారు. ఈ తరుణంలో… జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రాబోతున్నారు.