అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. ఆయన పెంచిపోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే అనర్థాలు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైకాపా నేతలే ఒప్పుకొన్నారు.
శాంతిభద్రతల అంశంలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలి. వైకాపా అబద్ధపు విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం. ఒకట్రెండు కార్పొరేషన్లకే జగన్ నిధులు మళ్లించారు. ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకొని పనిచేద్దామని ఎంపీలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.