రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావుల మధ్య మాటల తూటాలు…సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాను రుణమాఫీ గడువులోగా పూర్తిచేసినందున అన్నమాట ప్రకారం హరీశ్‌రావు రాజీనామా చేయాలని వైరా సభ వేదికగా సీఎం రేవంత్ డిమాండ్ చేసిన విషయం విదితమే. అయితే రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ కౌంటర్ అటాక్ చేయడం ఈ విషయంలో మరింత హీట్ పుట్టించింది.
ఇంత దిక్కుమాలిన సీఎం ఎవరూ లేరన్న హరీశ్‌రావు
చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నావ్ రేవంత్ అంటూ సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌రావు. ఆగస్టు 15 లోగా 31 వేల కోట్లు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్…చెప్పిందంతా మోసమే, చేస్తున్నదంతా అబద్ధమే అని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు హరీశ్‌రావు. దీనికా నువ్వు నన్ను రాజీనామా చేయమంటుంది అంటూ రివర్స్ అటాక్ చేశారు.
చదవండి: టాలీవుడ్‌కు దగ్గరవుతున్న బాలీవుడ్
అసలు కాంగ్రెస్ ఇచ్చిందెంతో తెలుసా..?: హరీశ్‌రావు
తమ ప్రభుత్వంలో మొదటి దఫా కింద 35 లక్షల మంది రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే అప్పట్లో 17వేల కోట్లు అయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీచేస్తే 22 లక్షల మందే ఉంటారా…దీనికి 17,869 కోట్లే ఖర్చవుతాయా అంటూ హరీశ్‌రావు గణాంకాలతో సహా వివరించి సీఎం రేవంత్‌ను కడిగిపారేశారు.