సీఎం రేవంత్‌రెడ్డి బృందం పదిరోజులపాటు విదేశీ పర్యటన పూర్తిచేసుకుని హైదరాబాద్ చేరుకుంది. అమెరికా, సౌత్ కోరియాలో పర్యటించిన సీఎం రేవంత్ బృందం పలు కంపెనీలతో కొన్ని ఎంఓయూలు కుదుర్చుకుంది. ఇది సక్సెస్‌ఫుల్ ట్రిప్ అని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడుతున్నాయి.
చదవండి: సికింద్రాబాద్ నుంచి ఛలో గోవా..!
విదేశీ పర్యటనపై రేవంత్ సంతృప్తి
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించిన రేవంత్‌రెడ్డి…అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని పేర్కొన్నారు. ఈ దిశగా తమ ప్రయత్నాలు ఫలించినట్లు చెప్పుకొచ్చారాయన. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు. అమెరికా టూర్‌తో రాష్ట్రానికి 31, 532 కోట్లు పెట్టుబడులను రేవంత్ రాబట్టారు. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు కుదుర్చుకుని 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం రేవంత్ కృషిచేశారు.