శనివారం ఖానామెట్ పరిధిలో ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్. కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈ కేసు హైకోర్టు వరకూ చేరుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు..
చెరువులను అక్రమించే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు రేవంత్‌రెడ్డి. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి విలయతాండవం చేస్తుందన్న ఆయన… చెన్నై, వయనాడ్ సంఘటనలను ఈ సందర్బంగా గుర్తుచేశారు.
చదవండి: జాతకాలు చెప్పే సారంగపాణి
దడపుట్టిస్తోన్న మిషన్ హైడ్రా..!
నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని హైడ్రా గడగడలాడిస్తోంది. కేవలం 42 రోజుల్లో చిన్న, పెద్ద భవనాలన్నీ కలిపి దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిషన్ హైడ్రాపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.