కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..!
ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!
మైసూర్ అర్బన్ డవలప్ అథారిటీ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎంకు చిక్కులు తప్పేలాలేదు. కోర్టు ఆదేశాలతో ఓ వైపు లోకాయుక్త పోలీసులు, మరోవైపు ఈడీ అధికారులు తలోదారిలో విచారణ జరుపుతున్న విషయం విదితమే. అయితే, ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త నుంచి నోటీసులు అందుకున్నారు సీఎం సిద్ధరామయ్య. ఈ మేరకు ఆయనే స్వయంగా వెల్లడించారు. ముడా కేసులో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని లోకాయుక్త పోలీసులు తనకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.
నవంబర్ 6న ఓవైపు లోకాయుక్త పోలీసుల ఎదుట భర్త సీఎం సిద్ధరామయ్య హాజరవుతుండగా…ఇదే ముడా కేసులో ఆయన భార్య పార్వతీని అక్టోబర్ 25న పోలీసులు ప్రశ్నించారు. సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు