విజయ్ ఓ రాజకీయ పసికూన: సీఎం స్టాలిన్
తమిళగ వెట్రి కళగం పార్టీతో రాజకీయ తెరంగేట్రం చేసిన తమిళ సూపర్‌స్టార్ ఇళయ దళపతి విజయ్…ఇటీవల తొలిసారిగా తన రాజకీయ సభ నిర్వహించి డీఎంకేను ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అంటూ విరుచుకుపడిన సందర్భం తెలిసిందే. అయితే ఆరోజు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రతిస్పందించారు. ఎక్కడాకూడా విజయ్ పేరెత్తకుండా విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవారు సైతం డీఎంకేను లేకుండా చేద్దామని అనుకుంటున్నారని, ఇలాంటి రాజకీయ పసికూనలు చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని స్పష్టం చేశారు.
విమర్శించేవారికి సమాధానం చెప్పుకుంటే పోతే తమకు టైమ్ వేస్ట్ అని అన్నారు సీఎం స్టాలిన్. ఉన్న సమయం అంతా ప్రజాసేవ కోసమే వినియోగిస్తామని తెలిపారు. ఎవరతై తమని విమర్శిస్తున్నారో ఒక్కటే చెప్తున్నా…తమ డీఎంకే ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడండి, విజయవంతంగా నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం…’విరోధులారా వర్ధిల్లండి’ అని అన్నాదురై చేసిన వ్యాఖ్యలే మాకు స్ఫూర్తి, ఇంతకు మించి తాను స్పందించలేనన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.