Wednesday, October 9, 2024

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కన్నుమూత

Spread the love

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున 3గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు డి. శ్రీనివాస్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ పనిచేశారు. డీఎస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించారు. 1989,1999,2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా డీఎస్ పనిచేశారు.

2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరారు డి. శ్రీనివాస్. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరారు. డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు. నిజామాబాద్ మేయర్గా పని చేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్న రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్. ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహాన్ని ఉంచారు. డీఎస్ మృతి వార్త విని ఆయన నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. డీఎస్‌ మృతిపై కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ట్వీట్‌ చేశారు. నా తండ్రి, గురువు అన్నీ నాన్నే భయపడకుండా పోరాడాలని నేర్పింది నాన్నే ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారు అని ట్వీట్ లో అరవింద్ పేర్కొన్నారు. రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Hot this week

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

Topics

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..! పెద్ద గుణపాఠమన్న కేజ్రీవాల్‌.

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..!హరియాణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా...

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణ.

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణమాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు...

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే : సీబీఐ

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే..! కోర్టులో తొలి ఛార్జిషీట్ ప్రొడ్యూస్ చేసిన సీబీఐకోల్‌కతా...

Related Articles

Popular Categories