ఆగస్టు 15 అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజని. ఇలాంటి ఇండిపెండెన్స్ డేను మనమెంతో ఘనంగా జరుపుకుంటాం. బ్రిటిషర్ల బందీఖానాలో ఉన్న మనకు 1947 ఆగస్టు 15 నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రోజులు వచ్చాయి. నాటి నుంచి మనం ఏటా ఆగస్టు 15న జెండావందనం చేసి, అమరుల త్యాగాలను స్మరిస్తూ వాడవాడలా పండగవాతావారణం ఉట్టిపడేలా జెండాలను రెపరెపలాడిస్తాం.
చదవండి: మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ
ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిన మరికొన్ని దేశాలు ఇవే..!
దక్షిణ కొరియా – 1945, ఆగస్టు 15న జపనీస్ పాలన నుంచి విముక్తి పొందింది.
ఉత్తర కొరియా కూడా జపాన్ ఆక్రమణ నుంచి ఆగస్టు 15నే స్వాతంత్ర్యం పొందింది.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో – 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి విముక్తి పొందింది.
బహ్రెయిన్ – 1971, ఆగస్టు 15న యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
లిచెన్ స్టెయిన్ – ఇక్కడ స్వాతంత్ర్య దినోత్సవం కాకున్నా ఆదేశపు జాతీయ దినాన్ని ఆగస్టు 15న జరుపుకోవడం ఆనవాయితీ.