నా ఇంటిని కొనడానికి మాధురి ఎవరు..?
ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది. ఏదైతే దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఆ ఇల్లు మాదని చెబుతున్నారో, దాన్ని నేను కొన్నానంటూ దివ్వెల మాధురి సడన్‌గా వీడియో రిలీజ్ చేసి అందులో ఆస్తిపత్రాలు కూడా చూపెట్టడంతో దువ్వాడ వాణి మరింత ఘాటుగా స్పందించారు. ఈ బిల్డింగ్ తాలూకా కేసు కోర్టులో ఉంది, పైగా ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ధర్మాసనం అనుమతిచ్చిందని చెప్పుకొచ్చిన వాణి…కోర్టు ఆదేశాలుఉండాగ మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదన్నారు. పైగా ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుందని తెలిపారు. అంతేకాదు, నా ఇంట్లో ఉండి రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తుందంటూ దివ్వెల మాధురిపై దువ్వాడ వాణి ఆరోపించారు.
చదవండి: దువ్వాడ ఇంట దివ్వెల షో..?
నా ఆస్తి అమ్మి ఇల్లు కొన్నానన్న వాణి..!
పుట్టింటినుంచి తెచ్చుకున్న ఆస్తినంతా అమ్మి ఈ ఇల్లు కొన్నానన్నారు దువ్వాడ వాణి. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టేది లేదని చెప్పేశారు. పలాసలో ఉన్న నా ఆస్తి అమ్మి కొన్న ఇల్లు ఇదని….పిల్లలకు చెందేలా చూడాలని అనుకునేదాన్నంటూ చెప్పారు. పోలీసుల సహకారంతోనే ఇంట్లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చిన దువ్వాడ వాణి….భర్తగా శ్రీనివాస్ మోసం చేస్తాడని అనుకోలేదని, పిల్లలను కూడా ఇంతలా చీట్ చేస్తాడని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారామె. తండ్రి ఆస్తి ఒక్కరూపాయికూడా రాలేదన్న దువ్వాడ వాణి…తన ఆస్తులన్నీ అమ్మి సంపాదించుకున్న ప్రాపర్టీ ఇదంటూ ఇల్లును ఉద్దేశిస్తూ మాట్లాడారామె.