ఓ టీవీ లైవ్‌లో దివ్వెల మాధురి చేసిన షాకింగ్ కామెంట్స్‌తో దువ్వాడ శ్రీనివాస్ అవాక్కయ్యారు. తనపై వచ్చిన రూమర్స్‌ను ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచిస్తున్న ఆయనకు…మాధురి లేటెస్ట్ స్టేట్‌మెంట్స్ మరింత ఇరకాటంలో పడేశాయి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే పిచ్చన్నారు దివ్వెల మాధురి. అంతేకాదు, శ్రీనివాస్ మంచి యాక్టర్ అన్న ఆమె…ప్రొడ్యూసర్‌గా తాను తీసిన వలంటీర్ మూవీలో దువ్వాడ యాక్ట్ చేశారని గుర్తుచేశారు. తనకు భరత నాట్యం వచ్చన్న ఆమె…ఓ రోజు శ్రీనివాస్ అడిగితే, ఆయన ఎదుట కూడా చేశానని గుర్తుచేశారు.
చదవండి: రామ్ చరణ్ గ్రేట్ యాక్టర్ – లుకాస్ బ్రావో
మాధురి అలా…భర్త ఇలా..!
దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మాధురి, అలాగే తన భర్త చంద్రబోస్ మాటలు వింటుంటే పరస్పర విరుద్ధ ప్రకటనల్లా కనిపిస్తున్నాయి. దువ్వాడ అఁటే తనకు పిచ్చని ఓవైపు బాహాటంగానే దివ్వెల మాధురి చెబుతుంటే…అమెరికాలో ఉన్న మాధురి భర్త చంద్రబోస్ మాత్రం వారిద్దరి వ్యవహారాన్ని ఖండిస్తూ, తన భార్య మాధురిపై పూర్తి నమ్మకం ఉందని, రాజకీయాల్లో మాధురి ఎదుగుదలను ఓర్వలేకనే తన భార్యపై నిందలు మోపుతున్నారని మీడియా ముందుకు వచ్చిమరీ స్టేట్‌మెంట్స్ ఇస్తుండటం కొసమెరుపు.