ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును.. కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించారు.. హెచ్‌ఓపీఎఫ్ (పోలీసు దళాల అధిపతి)గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ జారీచేశారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారికాగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సీనియార్టీ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు.
ద్వారకా తిరుమలరావు గుంటూరువాసి కాగా.. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారి కాగా.. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు.. కృష్ణ నగర్‌లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్