ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం పాలక పక్షంలో గుబులు రేపుతోంది ఎక్కడ అవినీతి జరిగినా… వదిలే ప్రసక్తే లేదని.. చర్యల విషయాల్లో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తాను గాని, తనకు కేటాయించిన శాఖలో పని పనిచేసే అధికారులు తప్పు చేసినా వదిలి పెట్టకూడదని అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పేర్కొనడం పలువురు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టించింది. ప్రజల సేవ కోసం.. అభివృద్ధికి దిక్సూచిగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని, ఆ మేరకు క్షేత్రస్థాయిలో కూడా విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన ప్రసంగించడంతో అసెంబ్లీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
చదవండి:కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు – సీఎం రేవంత్ రెడ్డి
దండుకో… దాచుకో.. దోచుకో అనే అంశాలకు ఎవ్వరూ అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది తప్పు జరిగిందని తేలితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదనే అనే భావన ఈ ప్రభుత్వం తప్పకుండా తీసుకువస్తుందని పవన్ కళ్యాణ్ నొక్కి ఒక్కనిచ్చారు. అదేవిధంగా సామాజిక మాధ్యమంలో కూడా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపడం సరైన చర్య కాదని, మంచిని బాగా ప్రచారం చేసి అవినీతిని ఎండగట్టాలని పవన్ కోరడం జరిగింది