విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ #PawanKalyan గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు.
జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు