పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురయిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారీ టైమ్ బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వ శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రి) అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు.
సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది? దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడదామని చె