తాడేపల్లిలో YCP కార్యాలయాన్ని కూల్చేయడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ‘రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని అన్నారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన YCP కార్యాలయాన్ని కూల్చేయించారని, హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని జగన్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయని. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలని జగన్ తన ట్వీట్ లో పిలుపునిచ్చారు. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.