సమర్థుడైన చంద్రబాబు ఏపీకి మరోసారి సీఎం ఖావడం శుభపరిణామం అన్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. గత ఐదేళ్ల జగన్ పాలనతో ఇప్పుడు చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్న ఆయన…
కేంద్రం సాయంతో వాటిని పరిష్కరించాలన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజల మన్ననలు, వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చదవండి: ఎమ్మెల్సీగా బొత్స గెలుపు..?
జగన్ పాలనతో రాష్ట్రం భ్రష్టుపట్టింది
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. వాటి పర్యవసానమే నేటి హత్యాకాండకు కారణాలని బాహాటంగా ఆరోపించారు.
జగన్‌ది ముమ్మాటికీ తప్పే…నేనైతే అలా చేయను..!
జిల్లాలను ఇష్టానుసారం విభజించి సీఎం హోదాలో జగన్ చారిత్రక తప్పు చేశారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. నేను సీఎంగా ఉండి ఉంటే అలా చేయను…మళ్లీ జిల్లాలను కలిపేవాడినని చెప్పుకొచ్చారు.