మొన్నటి స్వారత్రిక ఎన్నికల్లో తన ఓటమిపై అనుమానాలు వ్యక్తంచేసిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈవీఎంలలో లోపాలు ఉంటే వెంటనే వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలు లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన బాలినేని…అందుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ముందుగా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తీసుకోవాలని ఈసీ తరఫు న్యాయవాది చెప్పడంతో…తదుపరి విచారణ మంగళవారానికి వాయిదాపడింది.
ఓ వైపు మాక్ పోలింగ్ షురూ..!
బాలినేని వేసిన పిటిషన్‌పై ఓవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే…ఈసీ ఇచ్చిన ఆదేశాలతో ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉన్న 12 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ కొనసాగడం కొసమెరుపు. నాలుగురోజులపాటు జరిగే ఈ మాక్ పోలింగ్‌లో రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాగే ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది.