అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి హైదరాబాదులో ఘన సన్మానం జరిగింది. ప్రముఖ గాంధేయవాది, మాజీ డిప్యూటీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగు భాష అభివృద్ధికి దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన శుభ సందర్భంగా
బుధవారం సాయంత్రం లక్డీకపూల్ హోటల్ సెంట్రల్ కోర్టు ప్రాంగణంలో సంగమం ఫౌండేషన్, ఎస్ఈడబ్ల్యూ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, ప్రముఖ రచయిత, సినీ నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు ముఖ్య అతిధులుగా విచ్చేసి శ్రీ బుద్ధప్రసాద్ గారిని ఘనంగా సత్కరించారు.