రైతులను మాఫీ పేరిట సీఎం రేవంత్ మోసం చేశారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40వేల కోట్ల రుణమాఫీచేస్తామని చెప్పిన రేవంత్…పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ మెత్తాన్ని 31వేల కోట్లకు తగ్గించేశారు. ఇప్పుడు మాఫీ పేరిట రైతుల ఖాతాల్లో వేసింది 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ మాత్రానికే హరీశ్‌రావు రాజీనామా చేయాలా?. అసలు రైతులను మోసగించిన సీఎం రేవంత్‌పై ముందుగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
చదవండి: ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక
నిరూపించండి…రాజకీయ సన్యాసం తీసుకుంటా
రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రైతులకు వందశాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలి…సీఎం సొంత నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి వెళ్దాం..అక్కడ వందశాతం రుణమాఫీ జరిగిందని ఒక్కరైతు చెప్పినా, నేను నా పదవికి రాజీనామా చేసి… రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్