వలంటీర్ల వ్యవస్థను రద్దుచేసే ఆలోచన లేదన్నారు గ్రామ,వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్. ఈ రెండు నెలలపాటు వేతనాలు ఎందుకివ్వలేదో చెప్పుకొచ్చారాయన. సాంకేతిక కారణాలతోనే జాప్యం జరిగిందని వివరణ ఇచ్చుకున్న ఆయన..పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించేందుకు ఆర్థికశాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలోనే వారి వారి అకౌంట్లలో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా కూడా ఇచ్చారు. కాగా, ఉన్నతవిద్య చదివిన వలంటర్లీకు శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టేందుకు తమ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది శివప్రసాద్ చెప్పడం కొసమెరుపు.
చదవండి: ‘కమిటీ కుర్రోళ్ళు’ దే హవా !!
అంతం కాదిది..ఆరంభం…
వలంటీర్లలో ఆనందం..?
జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో లక్షలాది మంది వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. అయితే గత ఎన్నికలప్రచారంలో వలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని కూటమి పెద్దలు హామీలు, ఆమేరకు మేనిఫెస్టోలో పొందపరచడంతో సంకీర్ణ సర్కార్ వస్తే తమ బతుకులు మరింత బాగుపడతాయన్న ఆనందంలో ఉండగానే…జూన్ 4న ఫలితాలు విడుదల అనంతరం గద్దెనెక్కిన బాబు సర్కార్ జూలై 1 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటంటికీ వెళ్లి పింఛన్ ఇప్పించేలా చేసింది. దీంతో డైలమాలో పడిపోయారు వలంటీర్లు. మీ ఉద్యోగాలకు మాది భద్రతంటూనే మరోవైపు రెండునెలల నుంచి వాళ్లకి జీతాలు కూడా ఇవ్వకుండా ఆపేసింది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఇక ఈ వలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు బాబు తెరలేపారని అంతా అనుకుంటున్న సమయాన ప్రభుత్వం నుంచి వచ్చిన పై ప్రకటన వారి ఆశలదీపాలు వెలిగించినట్లయింది. చూద్దాం..మున్ముందు ఏం జరుగుతుందో..?